top of page

ఉచిత తెలుగు సాధనా పనిముట్లు 

నా తెలుగు అద్భుతం. నా తెలుగు అసామాన్యం. 

Radio Baba Telugu.jpg

నా తెలుగుతల్లికి నా వినయపూర్వక నమస్సులు 🙏 🙏. 

తెలుగు మనందరికీ గురువు. తెలుగు మనందరికీ తల్లి. తెలుగు మనలో అంకురించిన జ్ఞ్యాన జ్యోతిని కన్న తండ్రి కూడా. జీవితంలో అతిముఖ్యమైన మొదటి ఆరు సంవత్సరాలూ మనం నేర్చుకున్న ప్రతీదీ తెలుగులోనే నేర్చుకున్నాము. నిజానికి తెలుగులో నేర్చుకోనిది ఏదీ జీవించేందుకు 'అతి ముఖ్యమైన'ది కానే కాదు కదా? అటువంటి తెలుగును గౌరవించి, దాని గొప్పదనాన్ని తెలుసుకొని, దాని మాధుర్యాన్ని ఆస్వాదించగలగడం అదృష్టమే కాదు, పదునైన మెదడుకు, మెరుగైన జీవితానికి, లోతైన వ్యక్తిత్వానికి, మనలోని అద్భుత భారత సంప్రదాయపు ధృడమైన వేర్లకూ అత్యవసరం. 

క్రిందనున్న కొన్ని సాధనా పనిముట్ల సహాయంతో, పిల్లలూ, పెద్దవారూ, తెలుగు వెలుగును జీవితాలలో మరింత దేదీప్యమానంగా నింపుకోగలుగుతారని ఆకాంక్ష. వాటిని డౌన్లోడ్ చేసుకొనే ముందు, సంపూర్ణ లబ్ది కొరకు, వాటికి సంబంధించిన వీడియోను వీక్షించడం మరువకండి. అసలు రేడియో బాబా ఒక్కో సాధననూ ఎందుకు ఇక్కడ ఇచ్చారో, ఆ దృక్పధాన్ని మొదట అర్ధం చేసుకోవడం బాగుంటుంది. 

తెలుగును ప్రేమించండి... వెలుగును పంచండి.

మీ తెలుగును ఇంకాస్త మరుగు పెట్టుకొనేందుకు రేడియో బాబా ఉచిత డౌన్లోడ్ కానుకలు:
(తప్పక ఏ డౌన్లోడ్ ఫైల్ తాలూకు వీడియో లింకు ద్వారా ఆ వీడియోను ముందు వీక్షించి, పిమ్మట డౌన్లోడ్ చేసుకోండి)

ధన్యవాదములు
🙏
- రేడియో బాబా 

bottom of page